తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆరోగ్య కార్యకర్తలపై ప్రేమతో బిగ్​బీ పోస్ట్

ప్రమాదకర కరోనా బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఆరోగ్య కార్యకర్తలు పాటు పడుతున్నారని అన్నారు బాలీవుడ్​ మెగాస్టార్​ అమితాబ్​ బచ్చన్​. వారందరూ అవిశ్రాంతంగా, నిస్వార్థంగా తమ సేవలను ప్రజలకు అందిస్తున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా తన తండ్రి రాసిన ఓ కవితను వారికి అంకితం చేశారు బిగ్​బీ.

Big B dedicates poetry to heatlh care workers, shares 'words from Babuji'
ఆరోగ్య కార్యకర్తలకు కవితను అంకితం చేసిన బిగ్​బీ

By

Published : Jul 20, 2020, 11:03 AM IST

కరోనా బారి నుంచి ప్రజలను రక్షించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న ఆరోగ్య కార్యకర్తలపై ప్రశంసలు కురిపించారు బాలీవుడ్​ మెగాస్టార్​ అమితాబ్​ బచ్చన్. "మమ్మల్ని రక్షించడానికి నిర్విరామంగా, నిస్వార్థంగా పనిచేసే ఆరోగ్య కార్యకర్తలకు మా నాన్న రాసిన కవితను అంకితం చేస్తున్నా" అని సోషల్​మీడియాలో పోస్ట్​ చేశారు అమితాబ్​. ఆరోగ్య కార్యకర్తల కోసం తన తండ్రి హరివంశ్​ రాయ్​ రాసిన కవితను వారికి అంకితం చేశారు.

"నేను వారితో ఉన్నాను. వారు వెన్నెముకను ఎప్పుడూ నిటారుగా ఉంచి పనిలో తమ దృష్టిని ఉంచుతారు. వారు న్యాయం చేసే హక్కును ఎప్పటికీ వదులుకోలేరు. వారు ఒంటరిగా ఉన్నా లేక సమూహంగా ఉన్నా వారందరితో నేను వెన్నెంటే ఉన్నా"

-అమితాబ్​ ట్విట్టర్ పోస్ట్​​ సారాంశం

ఈ కవిత్వంతో పాటు రెండు పెన్సిల్​ స్కెచ్​ చిత్రాలను కలిపి ఇన్​స్టాలో పంచుకున్నారు అమితాబ్​. మొదటి చిత్రంలో ఆరోగ్య కార్యకర్త ముసుగు ధరించి, చేతిలో గులాబీని పట్టుకుని ఉండగా.. రెండో చిత్రంలో బచ్చన్​ స్కెచ్​ ఉంది.

అమితాబ్​ బచ్చన్​తో పాటు ఆయన కుమారుడు అభిషేక్​ బచ్చన్​కు ఇటీవలే కరోనా సోకడం వల్ల, ప్రస్తుతం ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు​. తాము కోలుకోవాలని దేశవ్యాప్తంగా ప్రార్థనలు చేసిన అభిమానులందరికీ కృతజ్ఞతలు చెప్పారు. ప్రతిఒక్కరి సందేశాల ద్వారా వారి ప్రేమను పొందినట్లు ట్విట్టర్​ వేదికగా బిగ్​బీ పంచుకున్నారు​.

ABOUT THE AUTHOR

...view details