బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ఆసుపత్రిలో చేరారు. ఇటీవలే(అక్టోబరు 11) 77వ పడిలోకి అడుగుపెట్టిన బిగ్ బీ.. రెగ్యులర్ చెకప్ కోసం ముంబయిలోని ఓ వైద్యశాలకు వెళ్లారు. ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్నందునే ఆయన ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నెల 15న ఆసుపత్రిలో చేరిన ఆయన ఇంకా అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది.