బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో సినీ ఇండస్ట్రీలో ఆందోళన నెలకొంది. అమితాబ్‌తో పాటు ఆయన కుమారుడు, బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్‌కూ వైరస్ సోకింది. ఈ విషయాన్ని అమితాబ్, అభిషేక్ స్వయంగా వెల్లడించారు. తాజాగా.. బిగ్‌బీ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్య అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నట్లు స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే సన్నిహితులు, అభిమానులు సహా సినీ ప్రముఖులు, క్రీడాకారులు బిగ్‌బీ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సామాజిక మాధ్యమాల్లో ఆయనకు ధైర్యం చెప్పారు.
"త్వరగానే మీరు ఆరోగ్యవంతులవుతారు" అంటూ మలయాళం సూపర్‌స్టార్ మమ్ముట్టి అన్నారు.
ప్రముఖ సినిమా దర్శకుడు కునాల్ కోహ్లీ స్పందిస్తూ.. "జాగ్రత్త సర్. లవ్ యూ మీరు బాగున్నారని త్వరగా చెప్పాలని ట్వీట్ కోసం ఎదురు చూస్తున్నా." అంటూ ట్వీట్ చేశారు. సినీ నటి బిపాసా బసు, సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దుల్కర్ సల్మాన్, పంకజ్ తిరుపతి, నిమ్రత్ కౌర్, హన్సర్ మెహ్తా తదితరులు బిగ్‌బీకి మద్దతుగా నిలిచారు.
"త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా అమిత్ అంకుల్" అంటూ సోనమ్ కపూర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. తాప్సీ పన్ను, షాహిద్ కపూర్లు కూడా అమితాబ్‌కు ధైర్యం చెప్పారు.
క్రికెటర్ల మద్దతు..
అమితాబ్ త్వరగా కోలుకోవాలని దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ ఆకాంక్షించారు. జాగ్రత్త వహించాలని సూచించారు. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా బిగ్‌బీకి మద్దతుగా నిలిచారు.