తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆర్ఆర్ఆర్' విడుదల తేదీ ప్రకటన - RRR release date

చరణ్-తారక్​ల మల్టీస్టారర్​ 'ఆర్ఆర్ఆర్' విడుదలపై స్పష్టత వచ్చింది. ఈ ఏడాది అక్టోబరు 13న సినిమా రిలీజ్ కానుంది.

BIG ANNOUNCEMENT FROM RRR MOVIE
'ఆర్ఆర్ఆర్' మూవీ

By

Published : Jan 25, 2021, 2:01 PM IST

Updated : Jan 25, 2021, 2:15 PM IST

'ఆర్ఆర్ఆర్​' నుంచి సరికొత్త అప్​డేట్ వచ్చేసింది. ఈ ఏడాది అక్టోబరు 13న సినిమా విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. గుర్రంపై రామ్‌చరణ్‌, బులెట్‌పై ఎన్టీఆర్‌లు దూసుకుపోతున్న పోస్టర్‌ అభిమానులను అలరిస్తోంది. 'అక్టోబరు 13న నీరు-నిప్పు కలిసి వస్తున్నాయి. ఆ శక్తిని ఇంతకు ముందెప్పుడూ మీరు చూసి ఉండరు. భారతీయ సినిమాలో అతి పెద్ద కలయిక అద్భుతమైన అనుభూతిని ఇచ్చేందుకు వస్తోంది' అని ట్వీట్ చేశారు.

ఈ సినిమాలో ​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, తారక్ కొమరం భీమ్​గా నటిస్తున్నారు. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతమందిస్తున్నారు. రాజమౌళి దర్శకుడు. డీవీవీ దానయ్య.. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్​తో సినిమా నిర్మిస్తున్నారు.

ఇది చదవండి:'ఆర్ఆర్ఆర్' విడుదల తేదీ.. పోస్ట్ తొలగించిన నటి

Last Updated : Jan 25, 2021, 2:15 PM IST

ABOUT THE AUTHOR

...view details