హిందీ భామ భూమి పడ్నేకర్, ఫాల్తూ సినిమా హీరో జాకీ భగ్నానీతో సహజీవనంలో ఉన్నట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వాటిపై ఆమె స్పందించింది. ఇద్దరూ మంచి స్నేహితులమని స్పష్టం చేసింది.
" జాకీతో డేటింగ్‌పై వస్తోన్న వార్తల్లో నిజం లేదు. అవన్నీ అసత్య ఆరోపణలు. ఇద్దరి మధ్య చాలా ఏళ్ల నుంచి మంచి స్నేహం ఉంది. ప్రస్తుతం నేనెవరితోనూ రిలేషన్షిప్లో లేను. నా వృత్తి, కెరీర్‌పైనే ఎక్కువ దృష్టిపెట్టాను".
-- భూమి పడ్నేకర్, బాలీవుడ్ నటి
ఇటీవల సోచిరియా చిత్రంతో అభిమానులను అలరించిందీ అమ్మడు. ప్రస్తుతం 'సాండ్ కీ ఆంఖ్' చిత్రంలో నటిస్తోంది పడ్నేకర్. ఇందులో తాప్సీతో కలిసి కనిపించనుంది. 'బాలా', 'డోలీ కిట్టీ ఔర్ ఓ చమక్తే సితారే', 'పతీ పత్నీ ఔర్ ఓ','తక్త్' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
సాండ్ కీ ఆంఖ్ చిత్రంలో భూమి జాకీ భగ్నాని 'కల్ కిస్నే దేఖా' చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. మిత్రన్ సినిమాలో చివరిసారిగా కనిపించిన ఆయన... 'ఫాల్తూ', 'అజయ్ గజబ్ లవ్', 'రంగ్రేజ్', 'యంగిస్థాన్' చిత్రాలతో మంచి గుర్తింపు పొందాడు.
ఇదీ చదవండి...బాలీవుడ్‌లో 'ధమ్' చూపించిన భూమి