తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ నటి ప్రైవేట్ వీడియో లీక్.. నెటిజన్లు ట్రోల్​ - భోజ్​పురి నటి త్రిషాకర్ మధు

ప్రముఖ నటికి సంబంధించిన వ్యక్తిగత వీడియో ఒకటి లీకైంది. దీంతో నెటిజన్​లు సదరు హీరోయిన్​ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరు ఆ నటి? ఏం జరిగింది?

Trisha Kar Madhu
భోజ్​పురి నటి త్రిషాకర్ మధు

By

Published : Aug 14, 2021, 5:15 PM IST

భోజ్​పురి నటి, డ్యాన్సర్​ త్రిషాకర్ మధు ప్రైవేట్​ వీడియో సామాజిక మాధ్యమాల్లో హాట్​టాపిక్​గా మారింది. నటి త్రిషాకర్.. తన బాయ్​ఫ్రెండ్​తో ఏకాంతంగా ఉన్నప్పుడు తీసిన ఓ వీడియోను సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చేశాడు. ఈ విషయమై నెటిజన్లు ఆమె ట్రోల్ చేస్తున్నారు.

అయితే.. నెటిజన్​ల తీరుపై త్రిషాకర్ అసహనం వ్యక్తం చేసింది. ఈ వీడియోను వైరల్ చేసిన వారిని ఆమె ట్విట్టర్​ ద్వారా హెచ్చరించింది.

త్రిషాకర్ మధు ట్వీట్​

" దేవుడు అంతా చూస్తున్నాడు. నా పరువు ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొందరు ఇలా వీడియో వైరల్​ చేశారు. కొంతమంది ప్రజలు ఇలా ఆలోచిస్తారని నేను అనుకోలేదు"అంటూ త్రిషాకర్ రాసుకొచ్చింది​.

భోజ్​పురి నటి త్రిషాకర్ మధు

త్రిషాకర్ స్వస్థలం బంగాల్. 'హమ్ హై హిందుస్థాన్​' సీరియల్ ద్వారా భోజ్​పురి చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు. ఎంతోమంది అగ్రహీరోలతో కలిసి ప్రత్యేక గీతాల్లో అలరించారు.

ఇదీ చదవండి:రికార్డులతో దూసుకెళ్తోన్న 'పుష్ప' సాంగ్​

ABOUT THE AUTHOR

...view details