తెలంగాణ

telangana

By

Published : Jan 10, 2020, 5:37 PM IST

ETV Bharat / sitara

నవ్వించేందుకు సిద్ధమైన నితిన్ 'భీష్మ'

నితిన్, రష్మిక ప్రధానపాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'భీష్మ'. వెంకీ కుడుముల దర్శకుడు. తాజాగా ఈ సినిమా టీజర్​ తేదీని ప్రకటించింది చిత్రబృందం.

bheeshma
bheeshma

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు శుభవార్త వినిపించాడు నితిన్‌. ఇంతకీ ఎదురు చూపులు దేనికంటారా? ఈ హీరో నటిస్తోన్న 'భీష్మ' టీజర్‌ కోసం. నితిన్ కథానాయకుడిగా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న చిత్రమిది. రష్మిక కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై పీడీవీ ప్రసాద్‌ సమర్పిస్తున్నారు.

తాజాగా భీష్మ టీజర్‌ విడుదల తేదీని ఖరారు చేసింది చిత్రబృందం. జనవరి 12న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ "నవ్వులు పూయించే టీజర్‌ రాబోతుంది" అని వ్యాఖ్యను జోడించాడు నితిన్. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌గ్లింప్స్, ఓ పాట సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.

ఇవీ చూడండి.. 'మహా సముద్రం'లోకి 'జాను' జంట..!

ABOUT THE AUTHOR

...view details