టాలీవుడ్ యువ కథానాయకుడు నితిన్ హీరోగా నటించిన 'భీష్మ' సినిమా ప్రీరిలీజ్ వేడుక సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా సినిమా బృందం చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
అభిమానులకు కడుపు నిండా డ్యాన్స్..
హీరో నితిన్ మాట్లాడుతూ.. "నా లైఫ్‌లో పంచప్రాణాలంటే మా అమ్మ, నాన్న, అక్క. ఆ తర్వాత పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇప్పుడు నాకు పెళ్లి కాబోతోంది కాబట్టి నా లైఫ్‌లోకి రాబోతున్న నా భార్య నా ఆరోప్రాణం. త్రివిక్రమ్ శ్రీనివాస్ నాకు టార్చ్ బేరర్ లాంటి వాడు. చివరి సినిమాకు ఈ సినిమాకు ఏడాదిన్నర గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ ఎందుకొచ్చిందంటే.. మంచి స్టోరీ కోసం ఎదురు చూడటం. సినిమా సెకండ్ హాఫ్‌లో అద్భుతమైన ఒక ఫైట్ ఉంటుంది. ఆ టైంలో నేపథ్య సంగీతం బాగా అందించాడు సాగర్. ఆ ఫైట్ చూసేటప్పుడు అభిమానులకు గూస్‌బంబ్స్ రావడం పక్కా. రష్మిక బాగా నటించింది. 'వాట్టే బ్యూటీ' సాంగ్‌లో ఆమె తప్ప ఎవరున్నా అంత పేరు వచ్చేది కాదు. నిర్మాత చినబాబు, వంశీ.. వీళ్లిద్దరితో కలిసి చేసిన మొదటి సినిమా 'అఆ'. ఇది రెండోది. మూడో సినిమా కూడా ఇప్పటికే ప్రారంభమైంది. నాలుగో సినిమా కోసం వంశీ స్కెచ్ గీస్తున్నాడు. షూటింగ్‌లో చాలా సహకరించాడు. ఇది పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్. ఫిబ్రవరి 21న థియేటర్లలో హంగామా చేసేందుకు సిద్ధంగా ఉండండి".
త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ..