దేశమంతటా దీపావళి పండగ సందడి కనిపిస్తోంది. అలాగే ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని టాలీవుడ్‌లోనూ కొత్త పోస్టర్లు కళకళలాడుతున్నాయి. ప్రేక్షకులకు పండగ శుభాకాంక్షలు తెలుపుతూ పలు చిత్రబృందాలు ఫొటోలు, వీడియోలతో సందడి చేస్తున్నాయి. 'బంగార్రాజు' చిత్రబృందం ఓ వీడియో విడుదల చేయగా, పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్, విజయ్ దేవరకొండ లైగర్ నుంచి కొత్త పోస్టర్లు విడుదలై అలరిస్తున్నాయి. అవేంటో చూసేయండి.
పవన్ కల్యాణ్, రానా ప్రధానపాత్రల్లో సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్న చిత్రం 'భీమ్లా నాయక్'. బుధవారం ఈ సినిమా నుంచి 'లాలా భీమ్లా' పాట విడుదల చేయగా ఇప్పటికీ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. తాజాగా ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
అక్కినేని నాగార్జున, నాగచైతన్య కాంబోలో వస్తోన్న చిత్రం 'బంగార్రాజు'. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 'సోగ్గాడే చిన్నినాయనా'కు ప్రీక్వెల్‌గా రూపొందుతోంది. తాజాగా ఈ పండగ రోజున ప్రత్యేక వీడియోను విడుదల చేసింది చిత్రబృందం.