తెలుగు రాష్ట్రాల్లో పవర్‌స్టార్ మేనియా మొదలైపోయింది. ఆయన ప్రధాన పాత్రలో నటించిన 'భీమ్లానాయక్' శుక్రవారం రిలీజ్ కానున్న సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. మొదటిరోజే తమ అభిమాన హీరో సినిమా చూడాలనుకుంటున్నామంటూ పోస్టులు పెడుతున్నారు.
మరోవైపు కళాశాలలు ఉండటం వల్ల ఫస్ట్‌డే ఫస్ట్ షోకు వెళ్లలేకపోతున్నామని పలువురు విద్యార్థులు కాస్త నిరాశకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రా విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఓ ప్రకటన నిన్నటి నుంచి వాట్సాప్‌లో వైరల్‌గా మారింది. విద్యార్థుల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని 'భీమ్లానాయక్' విడుదల సందర్భంగా శుక్రవారం ఆంధ్రా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెలవు ప్రకటిస్తున్నట్లు అందులో ఉంది.