తెలంగాణ

telangana

ETV Bharat / sitara

షూటింగ్​ స్పాట్​లో 'భీమ్లా నాయక్'.. 'బంగార్రాజు' రొమాంటిక్ సాంగ్ - vikranth rona release date

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో భీమ్లా నాయక్, బంగార్రాజు, గమనం, విక్రాంత్ రోణ, మార్బియెస్ చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

bheemla nayak bangarraju movie
భీమ్లా నాయక్ బంగార్రాజు మూవీ

By

Published : Dec 5, 2021, 5:57 PM IST

*'భీమ్లా నాయక్​' నుంచి ఫ్యాన్స్​కు సర్​ప్రైజ్ వచ్చింది. షూటింగ్​ స్పాట్​లో పవన్​-త్రివిక్రమ్​ ఉన్న ఫొటోను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఇందులో పవర్​స్టార్ నవ్వుతూ కనిపించారు.

భీమ్లా నాయక్​ షూటింగ్​లో పవన్-త్రివిక్రమ్

ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. రానా ప్రధాన పాత్రలో నటించారు. నిత్యామేనన్, సంయుక్త హీరోయిన్లు. తమన్ సంగీతమందించారు. త్రివిక్రమ్.. స్క్రీన్​ప్లే-మాటలు రాశారు. సాగర్ కె చంద్ర దర్శకుడు.

*'బంగార్రాజు' సినిమాలోని 'నీ కోసం' అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదలైంది. సిద్​ శ్రీరామ్​ పాడిన ఈ పాట అలరిస్తుంది. ఈ గీతంలో సినిమాలోని ప్రధాన పాత్రధారులైన నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి కనిపించారు.

'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాకు ప్రీక్వెల్​గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతమందించారు. కల్యాణ్​కృష్ణ దర్శకత్వం వహించగా, నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్​ బ్యానర్​పై నిర్మించారు.

* 'గమనం' సినిమ సెన్సార్ పూర్తయింది. క్లీన్ యూ సర్టిఫికెట్​ను ఈ సినిమా సొంతం చేసుకుంది. డిసెంబరు 10న థియేటర్లలోకి రానుంది. ఇందులో శ్రియ, నిత్యామేనన్, సుహాస్, ప్రియాంక జవాల్కర్, శివ కందుకూరి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇళయరాజా సంగీతమందించారు. సుజనా రావ్ దర్శకత్వం వహించారు.

గమనం మూవీ

*కన్నడ స్టార్ సుదీప్ హీరోగా నటించిన 'విక్రాంత్ రోణ' నుంచి కొత్త అప్డేట్ వచ్చింది. సినిమా రిలీజ్​ డేట్​ను డిసెంబరు 7న ఉదయం 11:05 గంటలకు వెల్లడిస్తామని చెప్పారు.

విక్రాంత్ రోణ మూవీ

పాన్ ఇండియా స్థాయిలో త్రీడీలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నీతా అశోక్, జాక్వెలిన్, శ్రద్ధా శ్రీనాథ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. అనూప్ భండారి డైరెక్టర్.

మార్బియెస్ మూవీ

ABOUT THE AUTHOR

...view details