న్యూ ఇయర్ జోష్‌ను మరింత పెంచేందుకు 'లా లా భీమ్లా' సాంగ్ డీజే వెర్షన్ రిలీజైంది. ఇప్పటికే విడుదలైన పాట అభిమానుల్ని అలరిస్తూ, యూట్యూబ్‌లో దూసుకెళ్తుంది. ఈ పాటలో లుంగీ, పోలీస్ డ్రస్‌లో కనిపించిన పవన్.. 'భీమ్లా నాయక్' సినిమాపై అంచనాల్ని పెంచుతున్నారు.
'లా లా భీమ్లా' పాట డీజే వెర్షన్ ఆగయా.. - pawan rana bheemla movie
అభిమానుల్లో ఇప్పటికే అలరిస్తున్న 'లాలా భీమ్లా' సాంగ్.. సరికొత్తగా డీజే వెర్షన్ కూడా వచ్చేసింది. శుక్రవారం సాయంత్రం ఈ పాట రిలీజైంది.
భీమ్లా నాయక్ సాంగ్
'అయ్యప్పనుమ్ కోశియమ్' రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో పవన్‌తోపాటు రానా ప్రధానపాత్రల్లో నటించారు. నిత్యామేనన్, సంయుక్త హెగ్డే హీరోయిన్లు. తమన్ సంగీతమందించారు. స్క్రీన్‌ప్లే, మాటలను త్రివిక్రమ్ అందించారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 25న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
ఇవీ చదవండి: