Bheemla Nayak Latest Update: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని అభిమానులకు మరింత కిక్ ఇచ్చేందుకు సిద్ధమైంది 'భీమ్లానాయక్' చిత్రబృందం. తాజాగా సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ ఇచ్చింది. స్టార్ హీరో పవన్‌కల్యాణ్, రానా హీరోలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే- మాటలు అందిస్తున్నారు దర్శకుడు త్రివిక్రమ్.
డిసెంబర్ 31న సాయంత్రం 7.02 గంటలకు 'లాలా.. భీమ్లా డీజే సాంగ్'ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. అయితే.. తొలుత విడుదలైన సాంగ్ ఇప్పటికే అభిమానులను అలరిస్తోంది.
మలయాళ హిట్ 'అయ్యప్పనుమ్ కోశియమ్' చిత్రానికి రీమేక్‌గా 'భీమ్లా నాయక్'ను తెరకెక్కిస్తున్నారు. నిత్యామేనన్, సంయుక్త హీరోయిన్లు. తమన్ సంగీతమందిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం సంక్రాంతి రేసు నుంచి తప్పుకొంది. ఫిబ్రవరి 25న థియేటర్లలోకి రానుంది.