ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ ప్రియులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న రోజు వచ్చేసింది. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్-రానా దగ్గుబాటి మల్టీస్టారర్‌గా రూపుదిద్దుకుంటోన్న సినిమా టైటిల్ ఖరారైంది. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్ విషయంలో ఎన్నో పేర్లు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. వాటికి పుల్‌స్టాప్ పెడుతూ సినిమా టైటిల్‌ను చిత్రబృందం ఆదివారం ఉదయం అధికారికంగా ప్రకటించింది. ఈమేరకు 'భీమ్లా నాయక్' అనే పేరు ఖరారు చేశారు. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబరు 2న సినిమాలోని తొలి సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్లు వీడియోలో వెల్లడించారు.
Pawan Kalyan: భీమ్లా నాయక్ మాస్‌లుక్ అదరహో! - భీమ్లా నాయక్
పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్‌కు 'భీమ్లా నాయక్' అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్రబృందం ప్రకటించింది. ఇందులోని పవన్‌కల్యాణ్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేశారు.
పృథ్వీరాజ్ సుకుమారన్, బిజుమేనన్ ప్రధాన పాత్రలుగా మలయాళంలో సూపర్‌హిట్ అందుకున్న 'అయ్యప్పనుమ్ కోషియమ్'కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. పవర్‌ఫుల్ కథాంశంతో సిద్ధమవుతోన్న ఈ సినిమాలో పవన్‌కల్యాణ్ భీమ్లానాయక్ అనే పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. మాతృకలో బీజుమేనన్ పోషించిన పాత్రను తెలుగులో పవన్, పృథ్వీరాజ్‌కుమార్ పోషించిన పాత్రలో రానా కనిపించనున్నారు. నిత్యామేనన్, ఐశ్వర్యా రాజేశ్ కథానాయికలు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలు అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఇదీ చూడండి..జెండా పండగ రోజు పవన్ 'భీమ్లా నాయక్' ఫస్ట్ గ్లింప్స్