తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'భీమ్లా నాయక్​'లో కొత్తగా 12 నిమిషాల సీన్లు? - bheemla nayak review

Bheemla nayak movie: పవన్​ 'భీమ్లా నాయక్' నుంచి సరికొత్త అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో కొత్తగా 12 నిమిషాల సీన్లు జోడించనున్నారని సమాచారం.

pawan bheemla nayak
పవన్ భీమ్లా నాయక్

By

Published : Feb 17, 2022, 6:47 PM IST

Updated : Feb 17, 2022, 6:54 PM IST

Pawan bheemla nayak: పవర్​స్టార్ పవన్‌కల్యాణ్‌ కొత్త సినిమా 'భీమ్లా నాయక్‌'. ఇందులో రానా కీలక పాత్ర పోషిస్తున్నారు. గురువారంతో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఫిబ్రవరి 25న విడుదల కానుంది. అయితే, ఫైనల్‌ కాపీని వీక్షించిన చిత్రబృందం సినిమాలో కొన్ని మార్పులు చేయాలని భావిస్తోందట. గతంలో తొలగించిన సీన్లలో కొన్నింటిని మళ్లీ జోడించనుందట.

భీమ్లా నాయక్ మూవీ సీన్స్

ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలను త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ అందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకునే సరికి నిడివి మూడు గంటలు దాటిందట. దీంతో త్రివిక్రమ్‌ సూచనతో కొన్ని సన్నివేశాల్ని తొలగించారు. ఫైనల్‌ కాపీలో నిడివి కాస్త తగ్గడం వల్ల ఎడిటింగ్‌లో తొలగించిన కొన్ని సీన్లను తిరిగి జోడించబోతున్నారు. అందులో పవన్‌పై తెరకెక్కించిన ఓ పాట కూడా ఉంది. ఆ పాటను చిత్ర బృందం ఇప్పటి వరకు విడుదల చేయలేదు. నేరుగా తెరపై చూపించాలన్న ఉద్దేశంతోనే అలా చేశారట. ఇటీవల లీకైన పవన్‌ కల్యాణ్‌ స్టిల్ ఆ పాటలోనిదేనని టాక్‌.

ఇది కాకుండా పోలీస్‌ స్టేషన్‌లో చిత్రీకరించిన కొన్ని కామెడీ సీన్లను కలిపి మొత్తం 10 నుంచి 12 నిమిషాల నిడివి ఉన్న సీన్లను జోడిస్తున్నారని సమాచారం. కాగా.. దీని వల్ల సినిమా విడుదల వాయిదా పడే అవకాశముందని ఊహగానాలు కూడా వెల్లువెత్తున్నాయి. దీనిపై చిత్రబృందం స్పష్టత ఇచ్చే వరకు వేచి చూడాల్సిందే.

భీమ్లా నాయక్​లో పవన్

మలయాళంలో విజయవంతమైన 'అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌'కు రీమేక్‌గా ఈ సినిమా తీశారు. సాగర్‌ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. పవన్‌ టైటిల్‌ పాత్రలో పోలీసు అధికారిగా, రానా డానియల్‌ శేఖర్‌గా కనిపించనున్నారు. పవన్‌ సరసన నిత్యమేనన్, రానా సరసన సంయుక్త మేనన్‌ నటించారు.

భీమ్లా నాయక్ కొత్త పోస్టర్

ఇవీ చదవండి:

Last Updated : Feb 17, 2022, 6:54 PM IST

ABOUT THE AUTHOR

...view details