పవర్‌స్టార్ అభిమానులకు మరోసారి ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమైంది 'భీమ్లానాయక్'(Bheemla Nayak Updates) చిత్రబృందం. ఇప్పటికే ఈ సినిమాలోని 'భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్ ప్రేక్షకులను అలరిస్తుండగా.. ఇప్పుడా చిత్రంలోని రెండో పాట(Bheemla Nayak Song Lyrics) 'అంత ఇష్టం'ను దసరా సందర్భంగా అక్టోబరు 15న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సందర్భంగా ఆ సాంగ్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేయగా.. అందులో పవన్ కల్యాణ్‌తో పాటు నిత్యా మేనన్(Bheemla Nayak Heroine) ఉన్నారు.
మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో 'భీమ్లా నాయక్'(Pawan Kalyan Bheemla Nayak) పాత్రలో పవన్.. డేనియల్ శేఖర్‌గా రానా నటిస్తున్నారు. ఇటీవలే పవన్, రానా పాత్రలకు సంబంధించిన గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేయగా.. అభిమానుల నుంచి విశేషాదరణ లభించింది. త్రివిక్రమ్(Trivikram Bheemla Nayak) స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ మూవీకి సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ స్వరాలను సమకూరుస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న(Bheemla Nayak Release Date) సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు.