సల్మాన్ ఖాన్ ఐదు విభిన్న పాత్రల్లో కనిపించనున్న సినిమా 'భారత్'. ఇప్పటికే విడుదలైన లుక్స్ ఆసక్తి రేపుతున్నాయి. తాజాగా వచ్చిన ట్రైలర్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. గని కార్మికుడు, నావికాదళ అధికారి, సర్కస్ కళాకారుడు, మధ్య వయస్కుడు, వృద్ధుడు.. ఇలా విభిన్న పాత్రల్లో ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాడీ కండల వీరుడు.
ట్రైలర్‌తోనే మాయ చేస్తున్న సల్మాన్ - అలీ అబ్బాస్ జాఫర్
సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న 'భారత్' ట్రైలర్ విడుదలైంది. ఐదు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడీ బాలీవుడ్ హీరో.
ట్రైలర్‌తోనే మాయ చేస్తున్న సల్మాన్
కత్రినా కైఫ్ హీరోయిన్గా నటించింది. ఇతర పాత్రల్లో టబు, జాకీ ష్రాఫ్, దిశా పటానీ, సునీల్ గ్రోవర్ కనిపించనున్నారు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించాడు. ఈద్ కానుకగా జూన్ 5న విడుదల కానుందీ సినిమా.
ఇది చదవండి: దబాంగ్‌తో మళ్లీ మాయ చేయనున్న భాయ్