సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన చిత్రం 'భారత్' వివాదంలో చిక్కుకుంది. అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కించిన ఈ సినిమాను రంజాన్ కానుకగా జూన్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఈ సినిమాకు 'భారత్' అనే టైటిల్ పెట్టడం చట్ట విరుద్ధమంటూ విపిన్ త్యాగి అనే వ్యక్తి దిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. సెక్షన్ 3 ప్రకారం భారత్ అనే పేరును బిజినెస్ కోసం వినియోగించరాదని, అంతేకాకుండా సినిమాలో పలు వివాదస్పద సంభాషణలు ఉన్నాయని విపిన్.. కోర్టులో తన వాదనలు కూడా వినిపించారు. చిత్ర విడుదలను ఆపివేయాలని కోరారు. దీనిపై దిల్లీ కోర్టు తీర్పు వెల్లడించాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ వ్యవహారంపై చిత్ర బృందం ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.