యువ నటీనటులు నవీన్ చంద్ర, సలోని లూత్రా కీలక పాత్రల్లో నటించిన వెబ్ ఫిల్మ్ 'భానుమతి రామకృష్ణ'. శ్రీకాంత్ నాగోతి దర్శకుడు. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్, కృష్వి ప్రొడక్షన్స్ పతాకంపై యశ్వంత్ ములుకుట్ల నిర్మిస్తున్నారు. జులై 3 నుంచి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర కొత్త ట్రైలర్‌ను యువ కథానాయకుడు నాని విడుదల చేశారు. '30 ఏళ్ల వయసులో అందమైన ప్రేమ కథ' అని ట్వీట్ చేశారు.
30 ఏళ్లు దాటిన ఓ యువతీ, యువకుడు మధ్య జరిగే ప్రేమ వ్యవహారాన్ని హృద్యంగా తెరకెక్కించినట్లు దర్శకుడు శ్రీకాంత్ నాగోతి చెప్పారు. ఫుల్ ఎంటర్టైనింగ్గా డిజిటల్ ఆడియన్స్‌కు నచ్చేలా సినిమా సాగనుందని నిర్మాత యశ్వంత్ ములకుట్ల అన్నారు.