'వచ్చానంటివో.. పోతానంటివో.. వగలు పలుకుతావే. కట్టమిందబోయే అలకల సిలకా భలేగుంది బాలా..' అంటూ అలక పాన్పునెక్కిన ప్రియురాల్ని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు శర్వానంద్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం శ్రీకారం.
సోమవారం ఈ చిత్రం నుంచి 'భలేగుంది బాలా' అనే జానపద గీతాన్ని విడుదల చేశారు. రాయలసీమ యాసలో హుషారుగా సాగుతున్న ఈ గీతానికి మిక్కీ జె.మేయర్ స్వరాలందించగా.. పెంచల్ దాస్ సాహిత్యాన్ని అందించి, ఆలపించారు. సినీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోందీ గీతం.