తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆర్జీవీకి హీరోయిన్​ దొరికేసిందా..! - irra mor

స్వీయ దర్శకత్వంలో రాంగోపాల్ వర్మ నటిస్తున్న సినిమా 'కోబ్రా'.  ఇందులో ఆర్జీవీ పక్కన హీరోయిన్​గా ఇర్రా మోర్ నటించనుందని సమాచారం.

కోబ్రా సినిమాలో హీరోయిన్​గా నటించనున్న ఇర్రా మోర్

By

Published : Apr 10, 2019, 4:45 PM IST

దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ మెప్పించేందుకు సిద్ధమయ్యాడు రాంగోపాల్ వర్మ. ప్రస్తుతం 'కోబ్రా' అనే సినిమాలో ఇంటెలిజెంట్ ఆఫీసర్​గా నటిస్తున్నాడు. 'భైరవగీత' ఫేం ఇర్రా మోర్ ఇందులో హీరోయిన్​గా కనిపించనుందని సమాచారం.

రాంగోపాల్ వర్మ కోబ్రా సినిమా పోస్టర్

'ఓ క్రిమినల్' జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది సినిమా. అగస్త్య మంజుతో కలిసి రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంతకు ముందు వీరిద్దరూ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'​కు దర్శకత్వం వహించారు.

భైరవగీత సినిమా తర్వాత మరో చిత్రం చేయలేదీ హీరోయిన్​. ఇందులో ఆమె నటనతో మెప్పించి మరిన్ని అవకాశాలు సంపాదిస్తుందేమో చూడాలి.

ఇది చదవండి: మరో బయోపిక్​కు రాంగోపాల్​ వర్మ సిద్ధం..!

ABOUT THE AUTHOR

...view details