Bollywood Actres Bhagyasree: బాలీవుడ్ నటి భాగ్యశ్రీ తన ప్రేమ, పెళ్లి విషయంలో జరిగిన ఆసక్తికర సంఘటనలను గుర్తుచేసుకున్నారు. స్మార్ట్ జోడి అనే టీవీ షోలో పాల్గొన్న ఆమె.. గతాన్ని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. తన తొలి చిత్రం 'మైనే ప్యార్ కియా'తోనే స్టార్‌గా ఎదిగిన భాగ్యశ్రీ.. తన ప్రియుడు హిమాలయ్ దాసనితో పెళ్లి తర్వాత నటనకు దూరమయ్యారు. 1990లో పెళ్లి చేసుకున్న ఈ జంట తమ జీవిత విశేషాలను షేర్ చేసుకున్నారు. తమ పెళ్లికి ఇరు కుటుంబాలు నిరాకరించాయని ఆనాటి విషయాల్ని గుర్తుచేసుకున్నారు.
" నా పెళ్లిలో మా కుటుంబసభ్యులు ఎవరూ లేరు. నేను అతడ్ని పెళ్లి చేసుకుంటానని మా తల్లిదండ్రులకు చెప్పాను. కానీ వాళ్లు ఒప్పుకోలేదు. తల్లిదండ్రులు తమ పిల్లలపై కలలు కన్నపుడు ఏది మంచిదో నిర్ణయించుకునే అవకాశం కూడా వారికే ఇవ్వాలి".