ప్రముఖ బాలీవుడ్ హాస్యనటుడు జగదీప్(81) అలియాస్ సయ్యద్ ఇష్తియాక్ అహ్మద్ జాఫ్రీ తుదిశ్వాస విడిచారు. ముంబయి బాంద్రాలోని ఆయన నివాసంలో ఆరోగ్య సమస్యలతో బుధవారం రాత్రి 8:30 గంటలకు కన్నుముశారు. జగదీప్‌కు ఇద్దరు కుమారులు జావేద్ జాఫ్రీ, నవేద్ జాఫ్రీలు ఉన్నారు. సౌత్ ముంబయిలో నేడు (గురువారం) ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు, నటీనటులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.
ప్రముఖ నటుడు జగదీప్ కన్నుమూత - comedian jagdeep trivia
ప్రముఖ నటుడు జగదీప్ అలియాస్ సయ్యద్ ఇష్తియాక్ అహ్మద్ జాఫ్రీ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
జగదీప్ సహ నటుడు, కమెడియన్ జాన్ లీవర్ ఆయన ఫొటోను షేర్ చేస్తూ.. "నా మొట్టమొదటి సినిమా 'యే రిషితా నా టూటే'లో నటుడు జగదీప్‌తో కలిసి నటించా. జగదీప్ భాయ్ వియ్ మిస్ యూ. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని కోరుకుంటున్నా" అంటూ ట్వీట్ చేశారు. బాలీవుడ్‌లో దాదాపు 400లకుపైగా సినిమాలలో నటించిన జగదీప్ 1975లో వచ్చిన 'షోలే'లో సూర్మ భోపాలి పాత్రను పోషించారు. ఆయన నటించిన అదే పాత్ర పేరుతో వచ్చిన 'సూర్మ భోపాలి' సినిమాకు దర్శకత్వం వహించి దర్శకుడిగా మారారు. ఆ తర్వాత అందాజ్ అప్నా, బ్రహ్మచారి, నాగిన్ వంటి సినిమాల్లో నటించారు.