తెలంగాణ

telangana

ETV Bharat / sitara

టాలీవుడ్​లో వినోదానికి కేరాఫ్​ 'ఒక్కడు' - తెలుగు తాజా సినిమా వార్తలు

ఈ ఏడాది ఎక్కువగా వినోదం అందించిన భారతీయ సినీ ప్రముఖుల పేర్లను ప్రకటించింది ట్విట్టర్​ సంస్థ. అందులో టాలీవుడ్​ నుంచి సూపర్​స్టార్​ మహేశ్​బాబు ఒక్కడే స్థానం దక్కించుకున్నాడు.

best entertainer of tollywood film industry is mahesh babu said twitter
టాలీవుడ్​లో వినోదానికి కేరాఫ్​ ఓకే ఒక్కడు..!

By

Published : Dec 11, 2019, 5:03 PM IST

సూపర్​స్టార్​ మహేశ్​ బాబు స్టైలే వేరు. ఇతడిని టాలీవుడ్​లో ఉన్న హాలీవుడ్​ హీరో అని అభిమానులు ముద్దుగా పిలుస్తుంటారు. మహేశ్​ కొత్త సినిమా ఏదైనా వస్తే చాలు వారి సందడి మాములుగా ఉండదు. ఇక అమ్మాయిలైతే ఇతడ్ని కలల రాకుమారుడిగా భావిస్తారు. ఈ ఏడాది ట్విట్టర్​ ద్వారా ఎక్కువ మందికి వినోదం అందించిన పదిమంది భారతీయ సినీ ప్రముఖుల పేర్లను ఆ సంస్థ ప్రకటించింది. అందులో తెలుగు చిత్రసీమ నుంచి ఒక్క మహేశ్​ మాత్రమే స్థానం సంపాదించాడు.

బాలీవుడ్‌ మెగాస్టార్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ ప్రథమ స్థానంలో నిలవడం విశేషం. ఇందులో ఎనిమిది మంది నటులు ఎంపిక కాగా.. వారిలో సంగీత దర్శకుడు ఏ.ఆర్‌.రెహమాన్, తమిళ దర్శకుడు అట్లీ ఈ జాబితాలో ఉన్నారు. దక్షిణాది నుంచి ఇద్దరి నటులకు మాత్రమే స్థానం దక్కింది. వారిలో మహేశ్​ తర్వాత కోలీవుడ్​ స్టార్​ విజయ్ చోటు దక్కించుకున్నాడు.

అమితాబ్, సల్మాన్‌ ఖాన్, అక్షయ్‌ కుమార్, షారుక్ ఖాన్, దళపతి విజయ్, ఏ.ఆర్‌.రెహమాన్, రణ్‌వీర్‌ సింగ్, అజయ్‌ దేవగణ్, మహేశ్ బాబు, అట్లీ.. వరుస క్రమంలో ఉన్నారు.

హీరోలతో పాటు కథానాయికల జాబితాను ప్రకటించింది ట్విటర్‌. ఇందులో ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ చోటు సంపాదించుకున్నారు. మిగతా తొమ్మిది మందిలో దక్షిణాది నుంచి రకుల్, కాజల్‌ ఉన్నారు. బాలీవుడ్​ తారలు సోనాక్షి సిన్హా, అనుష్క శర్మ మొదటి రెండు స్థానాలను దక్కించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details