తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రముఖ​ సీరియల్​ నటిపై అత్యాచారం

తనపై అత్యాచారం జరిగిందని జాదవ్​పూర్​ పోలీసులను ఆశ్రయించింది ఓ బంగాల్​ నటి. పరిచయమున్న యువకుడే ఈ నెల 8న తనపై అత్యాచారం చేశాడని పోలీసు ఫిర్యాదులో పేర్కొంది.

Bengali actress allegedly raped in her flat, files police complaint
బంగాల్​ సీరియల్​ నటిపై అత్యాచారం!

By

Published : Jul 10, 2020, 4:17 PM IST

Updated : Jul 10, 2020, 4:42 PM IST

పశ్చిమ బంగాకు చెందిన ఓ టీవీ నటి.. తనపై అత్యాచారం జరిగిందని పోలీసులను ఆశ్రయించింది. పరిచయస్తుడైన యువకుడే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు జులై 8న నమోదైన ఫిర్యాదులో పేర్కొంది. 'సాత్​ బాయ్​ చంపా' అనే​ ధారావాహికలో ఈమె ఓ కీలకపాత్రలో నటిస్తోంది.

చరవాణిలో వీడియో

బాధిత నటికి తెలిసిన ఓ యువకుడు.. జులై 5న అప్పు కోసం ఆమె నివాసానికి వచ్చాడు. ఈ క్రమంలోనే ఒంటరిగా ఉన్న ఆ మహిళపై అత్యాచారం చేసి, తన చరవాణిలో వీడియో తీసినట్లు వెల్లడించింది. పోలీసులకు చెప్తే​ సదరు వీడియోను ఇంటర్నెట్​లో పెడతానని ఆమెను బెదిరించినట్లు పేర్కొంది. దీంతో బాధితురాలు జాదవ్​పూర్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

కలవాలని ఒత్తిడి

బాధితురాలు పశ్చిమ బంగాలోని నడియా జిల్లాకు చెందిన ఈ యువతి.. వృత్తిలో భాగంగా మోడలింగ్​ నేర్చుకుంటూ కోల్​కతాలో ఒంటరిగా ఉంటుంది. తనపై అత్యాచారం చేసిన అతడితో ఆమెకు ఇదివరకే పరిచయం ఉంది. నిందితుడు లాక్​డౌన్ మొదలైనప్పటి నుంచే​ తనను కలవాలమని ఒత్తిడి చేసేవాడని.. దానికి తను అంగీకరించలేదని ఆమె తెలిపింది. తన వ్యాపారంలో నష్టాలు రావడం వల్ల అప్పు అడిగేందుకు వచ్చిన అతడు, ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని పేర్కొంది.

Last Updated : Jul 10, 2020, 4:42 PM IST

ABOUT THE AUTHOR

...view details