తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆస్కార్ నటులతో త్వరలో యుద్ధ గాథ - మాట్ డామన్​

హాలీవుడ్​ నటులు బెన్ అఫ్లెక్, మాట్ డామన్​కు సక్సెస్​ఫుల్​ కాంబినేషన్​గా పేరుంది. ఈ జోడీ మరోసారి రిడ్లే స్కాట్ తెరకెక్కించనున్న 'ద లాస్ట్ డ్యూయల్' సినిమాలో పనిచేయనున్నారు. 1997లో విడుదలైన 'గుడ్ విల్ హంటింగ్' చిత్రానికి ఒరిజినల్​ స్క్రీన్ ప్లే విభాగంలో ఈ ఇద్దరికీ ఆస్కార్ రావడం విశేషం.

బెన్ అఫ్లెక్, మాట్ డామన్

By

Published : Jul 23, 2019, 6:19 PM IST

ప్రముఖ చిత్ర నిర్మాత రిడ్లే స్కాట్ నిర్మించనున్న 'ద లాస్ట్ డ్యూయల్' చిత్రంలో బెన్ అఫ్లెక్, మాట్ డామన్ కలిసి నటించనున్నారు. వీరిద్దరి కాంబినేషన్​లో వచ్చిన 'గుడ్ విల్ హంటింగ్' చిత్రంలో ఒరిజినల్​ స్క్రీన్ ప్లే విభాగంలో ఆస్కార్ కూడా గెలుచుకున్నారు. 'కెన్ యు ఎవర్ ఫర్​గివ్ మీ?' ఫేం రచయిత్రి నికోలే హోలోఫ్సెనర్‌ ఈ కొత్త చిత్రానికి రచనా సహకారం అందించనుంది.

ఎరిక్ జాగర్ రాసిన పుస్తకం 'ద లాస్ట్ డ్యూయల్: ఎ ట్రూ స్టోరీ ఆఫ్ క్రైమ్, స్కాండల్ అండ్ ట్రయల్ బై కంబాట్ ఇన్ మిడీవల్ ఫ్రాన్స్' ఆధారంగా సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. 14 శతాబ్దంలో ఫ్రాన్స్‌లో ఇద్దరు యోధుల మధ్య జరిగిన యుద్ధం దీని కథాంశం.

యుద్ధానికి వెళ్లిన ఓ సైనికుడి భార్యపై అతడి స్నేహితుడే అత్యాచారం చేస్తాడు. ఆ ఘటనపై ఆమె ఎవరికి చెప్పినా నమ్మరు. న్యాయం చేయమని స్వయంగా ఆ సైనికుడు ఫ్రాన్స్ రాజును ఆశ్రయిస్తాడు. తప్పు చేసిన వ్యక్తితో ముఖాముఖి తలపడేందుకు అనుమతివ్వాలని కోరగా.. మహారాజు అంగీకరిస్తాడు. ఫ్రాన్స్​లో చట్టబద్ధంగా మంజూరయిన చివరి రణరంగంగా నిలిపోయిందీ కథ.

నటుడు డామన్, నిర్మాత స్కాట్​ కలిసి 2015లో 'ద మార్టిన్​'కు పనిచేశారు. 'ద లాస్ట్ డ్యూయల్' చిత్రాన్ని స్కాట్, డామన్, అఫ్లెక్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details