తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బెల్​ బాటమ్ ట్రైలర్, వరుడు కావలెను సాంగ్ రిలీజ్.. - వరుడు కావలెను

కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. ఇందులో 'బెల్​ బాటమ్', 'మాస్ట్రో', 'వరుడు కావలెను'.. చిత్రాలకు సంబంధించిన విశేషాలు ఉన్నాయి.

maestro
మాస్ట్రో

By

Published : Aug 3, 2021, 10:12 PM IST

అక్షయ్‌ కుమార్‌ 'బెల్ బాట‌మ్' ట్రైలర్ వచ్చేసింది. ఆగస్టు 19న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా 2డీ, 3డీ ఫార్మాట్​లో రానుందని అక్షయ్ చెప్పారు. ఎం.తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వాణీ క‌పూర్‌, హ్యూమా ఖురేషీ, లారా దత్తా త‌దితరులు కీలక పాత్రలు పోషించారు.

మరో సాంగ్ రెడీ..

నితిన్ 'మాస్ట్రో'నుంచి రెండో లిరికల్ సాంగ్ ప్రోమో బుధవారం సాయంత్రం విడుదల కానుంది. ​'వెన్నెల్లో ఆడపిల్లా' అంటూ ఈ గీతం సాగనుంది. హిందీ బ్లాక్​బస్టర్ 'అంధాధున్' రీమేక్​గా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నభా నటేష్, తమన్నా కీలకపాత్రల్లో నటించారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. త్వరలో విడుదల తేదీపై స్పష్టత రానుంది.

సోనూ.. కమింగ్

సోనూసూద్​ ప్రధాన పాత్రలో 'సాత్​ క్యా నిభోగే' అనే సాంగ్​ ఆగస్టు 5న విడుదల కానుంది. ఈ సాంగ్​లో నిధి అగర్వాల్ హీరోయిన్​గా చేస్తుంది. ఈ పాటను ఫరాఖాన్​ దర్శకత్వం వహించారు.

దిగు దిగు దిగు నాగ..

నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటిస్తున్న చిత్రం 'వరుడు కావలెను'. లక్ష్మీసౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని 'దిగు దిగు దిగు నాగ' సాంగ్​ ప్రోమో సోమవారం విడుదలైంది. పూర్తి గీతం ఆగస్టు 4న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నారు.

ఇదీ చదవండి:'సూపర్ డీలక్స్​' తెలుగు ట్రైలర్‌ వచ్చేసింది..

ABOUT THE AUTHOR

...view details