తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఛత్రపతి'​కి అనన్య గ్రీన్​సిగ్నల్​ ఇస్తుందా? - అనన్య పాండే ఛత్రపతి రీమేక్​

ఛత్రపతి హిందీ రీమేక్​ కోసం హీరోయిన్​ అనన్య పాండేను చిత్రబృందం సంప్రదించిందని సమాచారం. ఆమెకు భారీ రెమ్యునరేషన్​ కూడా ఇచ్చేందుకు సిద్ధమైందని తెలిసింది. ప్రస్తుతం ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయి.

chatrapathi
ఛత్రపతి

By

Published : Feb 18, 2021, 5:31 AM IST

Updated : Feb 18, 2021, 6:37 AM IST

టాలీవుడ్‌ యంగ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగులో సూపర్‌ హిట్‌ అయిన 'ఛత్రపతి' హిందీ రీమేక్‌లో నటిస్తున్నారు. దర్శకుడు వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతోనే ఆయన‌ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం హీరోయిన్‌ల వేట కొనసాగుతోంది. ఇందుకోసం ఇప్పటికే కొందరు స్టార్‌ హీరోయిన్లను కూడా అడిగారని సమాచారం.

అయితే తాజాగా బాలీవుడ్​ హీరోయిన్​‌ అనన్య పాండే చిత్ర బృందం సంప్రదించిందని తెలిసింది. ఆమెకు భారీ రెమ్యునరేషన్‌ కూడా ఇచ్చేందుకు సిద్ధమయ్యారని వినికిడి. ప్రస్తుతం ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయి. మరి ఈ ఆఫర్​కు అనన్య ఒప్పుకుంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అనన్య.. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లైగర్'‌ సినిమాలో నటిస్తోంది.

కాగా, శ్రీనివాస్‌ను హీరోగా 'అల్లుడు శీను' సినిమాతో వీవీ వినాయక్‌ టాలీవుడ్‌కు పరిచయం చేశారు. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో 'ఛత్రపతి' రీమేక్‌ తెరకెక్కనుండటం విశేషం.

ఇదీ చూడండి: బాలీవుడ్​కు మకాం మార్చిన బెల్లంకొండ!

Last Updated : Feb 18, 2021, 6:37 AM IST

ABOUT THE AUTHOR

...view details