టాలీవుడ్లో మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్న ఆరడుగుల అందగాడు బెల్లంకొండ శ్రీనివాస్. కెరీర్ ప్రారంభం నుంచి యాక్షన్ సినిమాలతోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే 'రాక్షసుడు' సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్నాడు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈనెల 29న లాంఛనంగా ప్రారంభం కానుందీ చిత్రం.
అయితే ఈ సినిమాలో యాక్షన్ డోస్ కాస్త ఎక్కువగానే ఉండనుందట. అందుకే 8 పలకల దేహంతో శరీరాకృతిని మలచుకున్నాడు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.