యువ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మరో తమిళ చిత్రంపై మనసు పడ్డారు. దాన్ని తెలుగులో రీమేక్ చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు ఆ చిత్రబృందంతో సంప్రదింపులు మొదలైనట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆయన రీమేక్ చేయనున్న సినిమా ఏంటో తెలుసా? ధనుష్ నటించిన 'కర్ణన్'. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆ చిత్రం తమిళంలో ఘన విజయం సాధించింది. రికార్డు స్థాయిలో వసూళ్లు సొంతం చేసుకుంది. తెలుగులో చేయడానికి తగిన సినిమా అని భావించి, నిర్మాత బెల్లంకొండ సురేష్ రీమేక్ హక్కుల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.
'కర్ణన్' రీమేక్‌లో బెల్లంకొండ.. నిర్మాతగా మరో హీరో - movie news
కొత్త అప్డేట్స్ వచ్చేశాయి. వీటిలో కర్ణన్ తెలుగు రీమేక్ గురించి, ఓ ట్రయాలజీతో నిర్మాతగా మారబోతున్న హీరో షాహిద్ కపూర్ గురించి ఉంది.
బెల్లంకొండ శ్రీనివాస్- షాహిద్ కపూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నిర్మాతగా మారేందుకు సిద్ధమయ్యారు. 'జెర్సీ' చిత్రీకరణతో బిజీగా ఉన్న అతడు.. నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తున్న ఓ భారీ ట్రయాలజీ నిర్మాణంలో భాగం కావాలనుకున్నారు. ఇందులో నటిస్తున్నందుకుగానూ ఇప్పటికే రూ.70-80 కోట్లు ఇతడు రెమ్యునరేషన్ రూపంలో అందుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాజ్, డీకే దర్శకత్వంలో అమెజాన్ ప్రైమ్ కోసం ఓ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నారు షాహిద్. అయితే గతంలోనే డింకీ సింగ్ బయోపిక్ నిర్మాతగా మారాలనుకు న్నాడు షాహిద్. కానీ ఆ ప్రాజెక్టు ఆగిపోయింది.