తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ట్రైలర్​: 'యాక్షన్​లో శీను గాడిది సపరేట్​ ట్రెండూ..!' - అల్లుడు అదుర్స్​ ట్రైలర్​

యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్​ హీరోగా, సంతోష్​ శ్రీనివాస్​ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'అల్లుడు అదుర్స్​'. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్​ను మంగళవారం చిత్రబృందం విడుదల చేసింది.

bellamkonda srinivas alludu adhurs movie trailer released
ట్రైలర్​: 'యాక్షన్​లో శీను గాడిది సపరేట్​ ట్రెండూ..!'

By

Published : Jan 5, 2021, 7:46 PM IST

'ఒక్కసారి నాది అనుకుంటే ప్రాణం ఇస్తా.. అదే నా క్యారెక్టరైజేషన్‌' అంటున్నారు యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్‌. ఆయన హీరోగా సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ 'అల్లుడు అదుర్స్‌'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది.

'శీనుగాడు నా ఫ్రెండ్‌.. యాక్షన్‌ సీక్వెన్స్‌లో వాడిది సపరేట్‌ ట్రెండ్‌.. ఇక్కడ హ్యాష్‌ ట్యాగ్స్‌ లేవమ్మా..' అంటూ వెన్నెల కిషోర్‌ చెబుతున్న డైలాగ్‌ నవ్వులు పూయిస్తోంది. నభా నటేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్‌, సోనూసూద్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుమంత్‌ మూవీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఆద్యంతం అలరించేలా సాగే ఈ ట్రైలర్‌ను మీరూ చూసేయండి.

ఇదీ చూడండి:మోహన్​లాల్​ వర్కౌట్స్​ వీడియో వైరల్​

ABOUT THE AUTHOR

...view details