తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'స్టూవర్ట్​పురం దొంగ'గా బెల్లంకొండ శ్రీనివాస్ - telugu new movie

గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు బయోపిక్​లో హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్​ను ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన టైటిల్ పోస్టర్​ను​ రిలీజ్ చేసింది చిత్రబృందం.

tiger nageswar rao biopic
టైగర్‌ నాగేశ్వరరావు బయోపిక్

By

Published : Aug 11, 2021, 2:05 PM IST

Updated : Aug 11, 2021, 2:21 PM IST

స్టూవర్ట్‌పురానికి చెందిన గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు జీవితకథను వెండితెరకు తీసుకురావాలని కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఈ సినిమా కథానాయకుడి పాత్రపై అనేక ఊహాగానాలు వచ్చాయి. మొదట్లో బెల్లకొండ శ్రీనివాస్​, నాని, రానా నటిస్తారని అనుకున్నారు. ఆ తర్వాత కథ రవితేజ వద్దకు చేరిందని ప్రకటనలు వచ్చాయి. కానీ చివరిగా ఈ కథకు బెల్లంకొండ శ్రీనివాస్​నే ఫైనల్​ చేసింది చిత్రబృందం. కేఎస్​ దీనికి దర్శకత్వం వహించనున్నారు. బెల్లంకొండ సురేశ్‌ నిర్మాత.

బెల్లంకొండ శ్రీనివాస్ ఇతర సినిమాలతో బిజీగా ఉండటం, కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్​ పోస్టర్ రిలీజ్ అయింది. దీని ప్రకారం 'స్టూవర్ట్​పురం దొంగ' అనే టైటిల్​ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే షూటింగ్​ ప్రారంభమవనుందని వెల్లడవుతోంది.

భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు సురేశ్. ఈ సినిమాను వచ్చే ఏడాదిలో సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:'నీరజ్‌ చోప్రా నా బయోపిక్‌లో హీరోగా నటించాలి'

షూటింగ్​లో నటుడు ప్రకాశ్​రాజ్​కు​ గాయం

Last Updated : Aug 11, 2021, 2:21 PM IST

ABOUT THE AUTHOR

...view details