తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మరోసారి అల్లుడు సెంటిమెంట్​తో బెల్లంకొండ - #BSS8

కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమాకు 'అల్లుడు అదుర్స్' అనే టైటిల్​ ఖరారు చేశారు. పోస్టర్​ను అభిమానులతో పంచుకున్నారు.

మరోసారి అల్లుడు సెంటిమెంట్​తో బెల్లంకొండ
కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్

By

Published : Mar 12, 2020, 2:16 PM IST

'రాక్షసుడు' సినిమాతో హిట్ అందుకున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. అదే ఉత్సాహంతో కొత్త చిత్రంలో నటిస్తున్నాడు. కమర్షియల్ ఎంటర్​టైనర్​గా రూపొందిస్తున్నారు. ఈరోజు టైటిల్​ను ప్రకటించారు దర్శకనిర్మాతలు. 'అల్లుడు అదుర్స్' అనే పేరు ఖరారు చేశారు. గతంలో ఈ కథానాయకుడు 'అల్లుడు శీను' సినిమాతో అరంగేట్రం చేశాడు. మరోసారి ఈ అల్లుడు సెంటిమెంట్ ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.

'అల్లుడు అదుర్స్' టైటిల్​ పోస్టర్

ఇందులో నభా నటేశ్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు. 'కందిరీగ' ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. సోనుసూద్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. వచ్చే నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ABOUT THE AUTHOR

...view details