తెలంగాణ

telangana

ETV Bharat / sitara

టాప్​లెస్ ఫొటోలతో హ్యాకర్​కు బుద్ధి చెప్పిన నటి - నటి

నగ్న చిత్రాలను అడ్డంపెట్టుకుని బెదిరిస్తున్న ఓ హ్యాకర్​పై నిరసన వ్యక్తం చేసింది హాలీవుడ్ నటి బెల్లా థోర్న్. తన అర్ధ నగ్న ఫొటోలను తానే సామాజిక మాధ్యమాల్లో ఉంచి ఆగంతుకిడికి బుద్ధి చెప్పింది.

బెల్లా

By

Published : Jun 17, 2019, 10:42 AM IST

హాలీవుడ్ నటి బెల్లా థోర్న్ సామాజిక మాధ్యమాల్లో టాప్​లెస్ ఫొటోలు పెట్టి నిరసన వ్యక్తం చేసింది. ఓ వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాను హ్యాక్​ చేసి బ్లాక్​మెయిల్​కు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ చిత్రాలను నెట్టింట ఉంచింది.

హ్యాకర్​, బెల్లా మధ్య జరిగిన సంభాషణలతో పాటు ఆ ఆగంతుకుడు పంపిన చిత్రాలను స్క్రీన్ షాట్​ తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచింది.

"నిన్న ఒక వ్యక్తి నా ఖాతాను హ్యాక్ చేశాడు. నా నగ్న ఫొటోలతో పాటు మరికొంత మంది సెలబ్రిటీస్ నగ్న చిత్రాలనూ నాకు పంపాడు. దీనిని చూసి ఆవేదన చెందా. అతను ఇంతటితో ఆగేలా లేడు. అందుకే నా ఫొటోలను నేనే సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నా. ఇంతకంటే అతడు చేసేదేమీ లేదు. ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉంటా. నా జీవితాన్ని ఎవరూ నియంత్రించలేరు. హ్యాకర్​ పంపిన ఫొటోస్ ఇవే" అని ట్వీట్​ చేసింది.

ఇవీ చూడండి.. భారీ సెట్స్​లో 'కేజీఎఫ్​2' షూటింగ్​!

ABOUT THE AUTHOR

...view details