అక్షయ్‌కుమార్ నిర్ణయాలు వేగంగా ఉంటాయి. అందులో భాగంగానే కరోనా రెండో దశ తర్వాత అందరి కంటే ముందు ఆయన 'బెల్‌బాటమ్'(Bellbottom movie) చిత్రంతో థియేటర్లలో (theaters open) అడుగుపెడుతున్నారు. రంజిత్ తివారీ తెర కెక్కించిన ఈ చిత్రం స్పై థ్రిల్లర్ కథాంశంతో రూపొందింది. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో భాగంగా ఈ చిత్రాన్ని త్రీడీలోనూ విడుదల చేయనున్నారు. ఓ పక్క అగ్ర హీరో చిత్రం థియేటర్లలో విడుదలవుతున్నా మరికొందరు ఇంకా ఓటీటీ బాటలోనే వెళుతున్నారు. కెప్టెన్ విక్రమ్ భత్ర జీవిత కథతో వస్తున్న 'షేర్షా' చిత్రం ఈ నెల 12న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. అజయ్‌దేవ్‌గణ్ ప్రధాన పాత్రలో నటించిన 'భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా' 13న డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు యుద్ధం నేపథ్యంగా సాగే చిత్రాలే కావడం విశేషం. వీటిని థియేటర్లలో బాగా ఆస్వాదించొచ్చు అనేది అభిప్రాయం. కానీ దర్శకనిర్మాతలు థియేటర్ విడుదలవైపు మొగ్గు చూపలేదు.
వీటి మాటేంటి?
ఏడాది కాలంగా కొన్ని చిత్రాలు థియేటర్లలోకి రావడానికి ఎదురుచూస్తున్నాయి. 'సూర్యవంశీ', '83' చిత్రాలపై భారీ అంచనాలున్నాయి. థియేటర్ల సందడి మొదలైనా వీటి విడుదలపై ఇంకా స్పష్టత రాలేదు. అక్షయ్‌కుమార్ హీరోగా రోహిత్ శెట్టి తెరకెక్కించిన 'సూర్యవంశీ'లో అజయ్‌దేవగణ్, రణ్‌వీర్‌సింగ్ అతిథి పాత్రలో నటించారు. 1983లో భారత్ క్రికెట్‌జట్టు సాధించిన ప్రపంచకప్పు విజయం నేపథ్యంలో '83' తెరకెక్కింది. రణ్‌వీర్‌సింగ్.. కెప్టెన్ కపిల్‌దేవ్‌గా నటించిన ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇక అలియాభట్ వేశ్యగా నటించిన ‘గంగూబాయి కతియావాడి’పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 'బంటీ ఔర్ బబ్లీ 2', 'సత్యమేవ జయతే2', 'ఛేహరే' లాంటివి చిత్రీకరణను పూర్తి చేసుకున్నాయి. ఈ బృందాల నుంచి విడుదల విషయంలో ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన రాలేదు.