తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అక్షయ్​ 3 సినిమాల విడుదల తేదీలు ఖరారు - అక్షయ్ కొత్త సినిమా

బాలీవుడ్​ స్టార్​ అక్షయ్​ కుమార్​ సినిమాలు వరుసగా విడుదల కానున్నాయి. అత్రాంగి రే, బెల్​ బాటమ్, పృథ్వీరాజ్​ సినిమాల విడుదల తేదీలను చిత్ర బృందాలు స్పష్టం చేశాయి. మరోవైపు క్రీడా​ నేపథ్యంలో తెరకెక్కనున్న అమితాబ్ సినిమా 'జుండ్​' జూన్​ 18న విడుదల కానుంది.

athrangi re release date
అక్షయ్​ 3 సినిమాలకు తేదీ ఖరారు- విడుదల ఎప్పుడంటే?

By

Published : Feb 19, 2021, 10:10 PM IST

బాలీవుడ్ సూపర్​ స్టార్​ అక్షయ్​ కుమార్, సారా అలీ ఖాన్ జంటగా నటిస్తోన్న 'అత్రాంగి రే' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఏ ఆర్​ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో తమిళ నటుడు ధనుష్​ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అయితే.. ఆగస్టు 6న ఈ చిత్రం విడుదల కానుందని దర్శకుడు ఆనంద్ ఎల్​ రాయ్​ స్పష్టం చేశారు.

అత్రాంగి రే సినిమాలో అక్షయ్, సారా, ధనుష్

అక్షయ్ కుమార్​ నటిస్తోన్న స్పై థ్రిల్లర్​ మూవీ 'బెల్​ బాటమ్' కూడా విడుదలకు సిద్ధమైంది. మే 28న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్స్​లో నటిస్తోన్న 'పృథ్వీరాజ్​' సినిమా ఈ ఏడాది దీపావళికి విడుదలకు నోచుకుంది.

రేసులో అమితాబ్​ 'జుండ్'

క్రీడా నేపథ్యంలో వస్తున్న.. బాలీవుడ్ మెగాస్టార్​ అమితాబ్ బచ్చన్ సినిమా 'జుండ్' జూన్​ 18న విడుదల కానుందని చిత్ర బృందం స్పష్టం చేసింది. నాగ్​రాజ్ పొపత్రావో మంజులే ఈ సినిమాను చిత్రీకరించారు. గతంలో 'సైరాట్'​ సినిమాతో మంజులే మంచి పేరు సంపాదించుకున్నారు.

ఇదీ చదవండి:అర్జున్​గా మొదలై.. భళ్లాలదేవగా సంచలనం

ABOUT THE AUTHOR

...view details