కరోనా నేపథ్యంలోనూ విదేశాల్లో షూటింగ్ చేసేందుకు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సిద్ధమయ్యారు. ప్రస్తుతం నటిస్తున్న 'బెల్ బాటమ్' చిత్రీకరణ, ఆగస్టు నుంచి లండన్‌లో జరగనుందని ట్వీట్ చేశారు. ఈ షెడ్యూల్లో భాగంగా అక్షయ్‌తో పాటు హ్యుమా ఖురేషి, లారా దత్తా తదితరులు యూకే వెళ్లనున్నారు.
కరోనా వ్యాప్తి ఉన్నా సరే లండన్‌కు అక్షయ్
కొత్త సినిమా షూటింగ్లో భాగంగా హీరో అక్షయ్ కుమార్‌తో పాటు పలువురు నటీనటులు, వచ్చే నెలలో లండన్‌కు వెళ్లనున్నారు. ఈ మేరకు అక్షయ్ ట్వీట్ చేశారు.
బెల్ బాటమ్ చిత్రబృందంతో అక్షయ్
కన్నడ హిట్ 'బెల్‌బాటమ్'కు రీమేక్ అయిన ఈ చిత్రాన్ని, 1980లో జరిగే కథతో తెరకెక్కిస్తున్నారు. ఇందులో వాణీ కపూర్ హీరోయిన్. రంజిత్ ఎమ్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.