అందం అంటే మేకప్ అనే భ్రమలో చాలా మంది ఉన్నారని అంటోంది స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. అది ఒక అపోహ మాత్రమే అని చెబుతోంది.
'మేకప్‌తోనే అందం వస్తుందనేది అపోహ మాత్రమే'
సౌందర్యం అంటే మనలా మనం కనిపిస్తూ.. ఆత్మవిశ్వాసంతో మెలగడమే అంటోంది హీరోయిన్ కాజల్ అగర్వాల్. అందం అంటే కేవలం మేకప్ మాత్రమే అనే భ్రమ నుంచి బయటకు రావాలని సూచించిందీ నటి.
'మేకప్‌తోనే అందం వస్తుందనేది కేవలం భ్రమ'
మేకప్ ద్వారానే ముఖానికి అందం వస్తుందని కొందరు భావిస్తున్నారు? మీ దృష్టిలో అందంగా ఉండటం అంటే ఏంటి?
కాజల్ అగర్వాల్:అందం అంటే మేకప్ అనే భ్రమలోకి వచ్చేశారు చాలా మంది. దీన్ని తొలగించడానికే నేనే మేకప్ లేకండా ఒక ఫొటో షూట్ చేశా. వాటిని సామాజిక మాధ్యమాల్లో ఉంచా. సామాజిక అనుసంధాన వేదికలు అందుబాటులోకి వచ్చాక చాలామంది ముస్తాబై ఫొటోలు తీసుకోవడం, పోస్ట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. అందం అంటే మనలా మనం కనిపిస్తూనే, ఆత్మవిశ్వాసంతో మెలగడమన్నదే నా నమ్మకం.
Last Updated : Sep 15, 2020, 7:50 AM IST