తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ముక్కాలా ముక్కాబులా' ఎలా వచ్చిందో తెలుసా..! - ప్రేమికుడు సినిమా

'ముక్కాలా ముక్కాబులా లైలా హో లైలా'..పాట సినీ అభిమానుల్ని ఓ ఊపు ఊపింది. కొత్తగా ఎన్ని పాటలు పుట్టుకొచ్చినా ముక్కాబులా స్థానం చెక్కు చెదరకుండా ఉండేది. అందులోని మ్యాజిక్‌ అలాంటిది. అసలు ఈ పాట అలానే ఎందుకు పాడారో తెలుసుకుందామా..?

behind-sences-of-Mukkala mukkabula
ముక్కాలా ముక్కాబులా ఎలా వచ్చిందో తెలుసా..!

By

Published : Dec 26, 2019, 7:00 AM IST

'ప్రేమికుడు' చిత్రం కోసం ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీత స్వరాలు అందించగా.. మనో 'ముక్కాబులా' పాటను ఆలపించారు. ఇందులో ఆయన స్వరం గమ్మత్తుగా ఉంటుంది. ఆయన అప్పటి వరకు పాడిన పాటలకు దీనికి సంబంధం ఉండదు. మనో జీవితం ‘ముక్కాలా’ పాటకి ముందు, తర్వాత అనే విధంగా మారిందంటే ఏ రేంజ్‌లో అలరించిందో అర్థమవుతుంది.


ఈ ప్రయోగం వెనకున్న కథేంటంటే.. సంగీత దర్శకుడు, రచయిత మనోని తెల్లవారుజామున 3 గంటలకు పాట పాడాలన్నారట. వేర్వేరు వాయిస్‌లతో విభిన్నంగా ఉండేలా ప్రయత్నించినప్పటికీ వాళ్లకి నచ్చలేదు. సంగీతం ఉంటే పాట పాడటం కాదు, నీ స్వరానికే సంగీతం ఇచ్చేలా చేయమన్నారట రెహమాన్‌. ఉదయాన్నే ఈ ఛాలెంజ్‌ అవసరమా అనుకుని టీ కోసం రికార్డింగ్‌ థియేటర్‌ నుంచి మనో బయటకు వెళ్లారట. టీ తాగుతుండగా అక్కడున్న ఓ వాచ్‌మెన్‌ హిందీలో పాడుతుంటే అది విని, వెంటనే రెహమాన్‌ దగ్గరకు వెళ్లి అదే విధానంలో పాడి చూపించారట. 'చాలా బావుంది. కొనసాగించు .. చరణం మొదలు పెట్టు అంటూ' రెహమాన్‌ పదిహేను నిమిషాల్లో పాటను పూర్తి చేయించారట. అలా ఓ ప్రయోగానికి మనో శ్రీకారం చుట్టారు.

ఇదీ చదవండీ:- కోబ్రా సినిమాలో 25 గెటప్​ల్లో నటించనున్న చియాన్​ విక్రమ్

ABOUT THE AUTHOR

...view details