కళాకారులు తమ ప్రతిభను ప్రపంచానికి చూపించేందుకు వేదికగా నిలుస్తోంది 'శ్రీదేవి డ్రామా కంపెనీ'. సుడిగాలి సుధీర్ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రతి ఆదివారం ప్రసారం అవుతోందీ షో. తాజా ఎపిసోడ్‌లో అరుదైన కళ బీట్ బాక్సింగ్‌ను (నోటితో పలు రకాల సంగీత శబ్దాలు చేయడం) పరిచయం చేసింది ఈ కార్యక్రమం.
బీట్ బాక్సింగ్‌తో దుమ్మురేపిన యువతి - సుడిగాలి సుధీర్ శ్రీదేవి డ్రామా కంపెనీ
సుడిగాలి సుధీర్ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో కేరళకు చెందిన ఓ యువతి బీట్ బాక్సింగ్‌తో అదరగొట్టేసింది. ఒకేసారి నాలుగు రకాల శబ్దాలు వినిపించి ప్రేక్షకుల్ని మైమరిపించింది. దీనికి సంబంధించిన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఓసారి దీన్ని మీరూ చూసేయండి..
![బీట్ బాక్సింగ్‌తో దుమ్మురేపిన యువతి beat boxing](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11787690-132-11787690-1621228171172.jpg)
బీట్ బాక్సింగ్
కేరళకు చెందిన అర్ధ సజన్ అనే యువతి ఈ కార్యక్రమానికి విచ్చేసి తన సత్తాను చాటింది. ఒకేసారి నాలుగు రకాల శబ్దాలు వినిపించి ప్రేక్షకుల్ని ఆశ్చర్యంలో పడేసింది. బాహుబలి సినిమాలోని పాటనూ ఆలపించి ఔరా అనిపించింది. దీనికి సంబంధించిన వీడియో యూ ట్యూబ్‌లో విడుదలైన కొన్ని గంటల్లోనే అత్యధిక వీక్షణలు సొంతం చేసుకుంది. బీట్ బాక్సింగ్‌లో డాక్టరేట్ పొందిన అర్ధ ప్రతిభను మీరూ చూసేయండి..