సూపర్‌స్టార్ రజనీకాంత్ స్టైల్‌ను కాపీ కొట్టేందుకు.. సాహసవీరుడు బేర్ గ్రిల్స్ తిప్పలుపడ్డాడు. వీరిద్దరు కలిసి ఉన్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అందులో రజనీ స్టైల్‌గా కళ్లజోడు పెట్టుకోవడం చూసిన బేర్ గ్రిల్స్.. తలైవాను అనుకరించడానికి ప్రయత్నించాడు. కానీ అతడి వల్ల కుదరలేదు. అయితే రజనీ కాస్త సాయం అందించినా ఫలితం లేకపోయింది.
చివరికి రజనీకాంత్ స్వయంగా కళ్లజోడు పట్టుకుని తన స్టైల్‌ను నేర్పించాడు." అందుకే నువ్వు సినిమా స్టార్.." అని వీడియోలో రజనీని మెచ్చుకున్నాడు బేర్ గ్రిల్స్. ఈ ఫన్నీ వీడియో నెటిజన్లను నవ్విస్తోంది.
తలైవాను కాపీ కొట్టాలంటే.. సాహసవీరుడికీ తిప్పలే - బేర్‌గ్రిల్స్-తలైవా
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ స్టైల్‌కు.. అభిమానుల్లో మంచి క్రేజ్ ఉంది. అతడి నడక, హావభావాలు, కళ్లజోడు తిప్పే విధానం, నోట్లో పెట్టి చుట్ట వెలిగించడం వంటి యాక్షన్లు మంచి పాపులర్ అయ్యాయి. అలాంటి భిన్నమైన స్టైల్‌ను అనుకరించేందుకు ప్రయత్నించాడు సాహస వీరుడు బేర్ గ్రిల్స్. ఆ సందర్భంలో తీసిన ఓ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
తలైవాను కాపీ కొట్టేందుకు బేర్ గ్రిల్స్‌కు తిప్పలు
డిస్కవరీ ఛానల్‌లో ప్రసారమయ్యే 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' షోలో రజనీ కనిపించాడు. సోమవారం రాత్రి 8 గంటలకు ఆ కార్యక్రమం ప్రసారమైంది. ఈ చిత్రీకరణ కోసం రజనీ కర్ణాటకలోని బందిపొరా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో.. బేర్ గ్రిల్స్‌తో కలిసి సాహసాలు చేశాడు. రజనీ తొలిసారి బుల్లితెరపై కనిపించిన షో కావడం వల్ల అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' షోలో గతంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కూడా పాల్గొన్నారు.