కథానాయకుడు రామ్‌చరణ్ ఇల్లు తుడిచి, మొక్కలకు నీరు పోసి, సతీమణి ఉపాసనకు స్వయంగా కాఫీ చేసి ఇచ్చారు. ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఛాలెంజ్ స్వీకరించి.. 'బి ద రియల్ మెన్'లో పాల్గొన్నారు. ఇంటి పనితో పాటు వంట పని కూడా చేసేశారు. ఈ పనులు చేయడాన్ని గర్వంగా భావించాలని ఈ సందర్భంగా చరణ్ చెప్పారు. ఇంట్లోని మహిళ పని భారాన్ని పంచుకుని నిజమైన పురుషుడిలా వ్యవహరిద్దామని పేర్కొన్నారు. అంతేకాదు దర్శకుడు త్రివిక్రమ్, బాలీవుడ్ కథానాయకుడు రణ్‌వీర్ సింగ్, రానా, శర్వానంద్‌కు సవాల్ విసిరారు.
'రియల్ మెన్' అనిపించుకున్న చరణ్ - బి ద రియల్ మెన్ ఛాలెంజ్ రామ్ చరణ్
'బి ద రియల్ మెన్' ఛాలెంజ్‌తో సినీ తారలు సందడి చేస్తున్నారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రారంభించిన ఈ సవాల్‌ను ఇప్పటికే రాజమౌళి, తారక్ పూర్తి చేశారు. తాజాగా హీరో రామ్‌చరణ్ ఇంటి, వంట పని చేస్తున్న వీడియోను నెట్టింట షేర్ చేశారు.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా 'బి ద రియల్ మెన్' ఛాలెంజ్‌ను ఆరంభించారు. ఇంటి పనుల్లో పాలుపంచుకుంటూ మహిళలకు సాయంగా నిలవాలన్నదే ఈ ఛాలెంజ్ ఉద్దేశం. సందీప్ రెడ్డి తను ఇంటి పనిచేస్తున్న వీడియోను షేర్ చేస్తూ.. రాజమౌళి కూడా వీడియో అప్‌లోడ్ చేయాలని కోరారు. ఆపై రాజమౌళి ఇంటి పనిచేసి.. తారక్, చరణ్ తదితరుల్ని నామినేట్ చేశారు. ఎన్టీఆర్ కూడా ఈ సవాలును స్వీకరించి.. మంగళవారం ఉదయం వీడియోను షేర్ చేశారు. "మన ఇంట్లో ప్రేమలు ఆప్యాయతలే కాదు. పనులను కూడా పంచుకుందాం" అంటూ బాలయ్య, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, కొరటాల శివకు ఛాలెంజ్ విసిరారు.
తారక్ సవాలుకు చిరు స్పందిస్తూ.. "ఛాలెంజ్ స్వీకరించా. అలాగే నీ స్నేహితుడు చరణ్ వీడియో కోసం ఎదురుచూస్తున్నా.." అని కామెంట్ చేశారు. "సవాలు స్వీకరిస్తున్నా తారక్ అన్నయ్య. నెల రోజుల ఫుటేజీ ఇప్పటికే మిస్ అయ్యింది.." అని కొరటాల శివ ట్వీట్ చేశారు.