తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బద్లాలో అమి'తాప్'ఖాన్​ - షారుక్‌ ఖాన్‌

'బద్లా' చిత్రంలో అమితాబ్, తాప్సీ ప్రధాన పాత్రల్లో​ నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్​ను నేడు చిత్రబృందం విడుదల చేసింది.

బద్లాలో అమితాబ్​, తాప్సీ

By

Published : Feb 12, 2019, 4:13 PM IST

Updated : Feb 12, 2019, 5:28 PM IST

బాలీవుడ్​ బిగ్​ బీ అమితాబ్​, తాప్సీ నటిస్తోన్న చిత్రం 'బద్లా'. సంజ‌య్‌ ఘోష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా... స్పానిష్​ చిత్రం 'ది ఇన్విసబుల్​ గెస్ట్​'కి హిందీ రీమేక్.​ 'పింక్‌' చిత్రం తర్వాత తాప్సీ, బిగ్​బీ కలిసి నటిస్తోన్న సినిమా ఇది.

  • ఈ సినిమా మార్చి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

మర్డర్‌ను ఛేదించే కేసు నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, అజూరే ఎంటర్‌టైన్‌మెంబ్‌ బ్యానర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌ లుక్‌ను షారుక్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా విడుదల చేశారు. పోస్టర్లలో అమితాబ్‌, తాప్సీ బాధపడుతున్నట్లుగా కనిపించారు. పోస్టర్​పై 'ప్రతిసారీ పగ తీర్చుకోవడం సరైంది కాదు. అలాగని ప్రతిసారీ క్షమించడమూ సరికాదు' అని రాసున్న డైలాగ్‌ ఆకట్టుకుంటోంది.

షారుక్‌ ఈ ఫొటోలను షేర్‌ చేస్తూ.. 'అమితాబ్‌జీ.. మీపై పగ తీర్చుకోవడానికి వస్తున్నా. సిద్ధంగా ఉండండి' అని సరదాగా ట్వీట్‌ చేశారు. ఇందుకు అమితాబ్‌ స్పందిస్తూ.. ' షారుక్‌...పగ తీర్చుకునే సమయం దాటిపోయింది. ఇప్పుడు అందరికీ పగను పంచాల్సిన సమయం వచ్చింది' అని పోస్టర్లను ఉద్దేశిస్తూ చమత్కరించారు.

Last Updated : Feb 12, 2019, 5:28 PM IST

ABOUT THE AUTHOR

...view details