ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జోయెల్ షూమేకర్ కన్నుమూశారు. కొంతకాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన జూన్ 22న న్యూయార్కులో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. కాస్ట్యూమ్ డిజైనర్‌గా 'స్లీపర్', 'ఇంటీరియర్స్' సహా అనేక సినిమాలకు పనిచేశారు. షూమేకర్ కొన్ని చిత్రాలకు రచయితగాను బాధ్యతలు నిర్వర్తించారు.
'బ్యాట్‌మన్ ఫరెవర్' దర్శకుడు షూమేకర్ కన్నుమూత - 'బ్యాట్‌మన్ ఫరెవర్' దర్శకుడు షూమేకర్ కన్నుమూత
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జోయెల్ షూమేకర్ కన్నుమూశారు. 'బ్యాట్‌మన్' చిత్రాలతో ఎంతో గుర్తింపు పొందిన ఈ దర్శకుడు కేన్సర్ వ్యాధి కారణంగా తుదిశ్వాస విడిచారు.

షూమేకర్
'ది ఇంక్రిడిబుల్ ష్రింకింగ్ ఉమెన్' చిత్రంతో దర్శకుడిగా ప్రస్థానం మొదలుపెట్టిన షూమేకర్ ఆ తర్వాత ఎన్నో చిత్రాలకు డైరెక్షన్ చేశారు. 'సెయింట్ ఎల్మోస్ ఫైర్'తో మొట్టమొదటి ఘనవిజయం సాధించారు. అనంతరం 'బ్యాట్‌మన్ ఫరెవర్', 'బ్యాట్‌మన్ అండ్ రాబిన్' చిత్రాలు ఆయనకు విపరీతమైన పేరును తెచ్చిపెట్టాయి. చివరగా ఆయన 2011 'ట్రెస్‌పాస్’' అనే చిత్రానికి దర్శకత్వం వహించారు.
Last Updated : Jun 23, 2020, 3:55 PM IST