తెలంగాణ

telangana

ETV Bharat / sitara

డిస్నీ వాటాదారుగా జార్జ్​ ఫ్లాయిడ్​ కుమార్తె - gianna floyd became a Disney stockholder

అమెరికా పోలీసుల చేతిలో చనిపోయిన జార్జ్​ ఫ్లాయిడ్​ కుమార్తె జియన్నాకు అండగా నిలిచారు ప్రముఖ గాయకురాలు బాబ్రా స్ట్రైసాండ్​. ఆరేళ్ల ఆమెను డిస్నీ వాటాదారుగా చేశారు.

Barbra Streisand makes George Floyd's daughter a Disney stockholder
డిస్నీ వాటాదారుగా జార్జ్​ ఫ్లాయిడ్​ కుమార్తె

By

Published : Jun 15, 2020, 7:06 PM IST

అమెరికా పోలీసుల కర్కశత్వానికి బలైన జార్జ్​ ఫ్లాయిడ్​ కుమార్తె జియన్నాకు అండగా నిలిచేందుకు ప్రముఖ గాయకురాలు బాబ్రా స్ట్రైసాండ్ ముందుకొచ్చారు. ఆమెను డిస్నీ వాటాదారుగా చేశారు.

జియన్నా తన ఇన్​స్టాగ్రామ్​ ఖాతాలో డిస్నీ షేర్ల సర్టిఫికెట్​ను పోస్ట్​ చేసి.. బాబ్రాకు కృతజ్ఞతలు తెలిపింది.

ఇటీవలే అమెరికాలో పోలీసుల దాష్టికానికి ఆఫ్రికన్అమెరికన్ జార్జ్​ ఫ్లాయిడ్​ మృతి చెందాడు. దీంతో అగ్రరాజ్యం మొత్తం ఆగ్రహజ్వాలలతో అట్టుడికిపోయింది. పోలీసుల కర్కశత్వాన్ని నిరసిస్తూ.. వేల మంది రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ర్యాపర్​.. కాన్యే.. జియన్నా చదువు కోసం నిధిని సమకూర్చే ఏర్పాటు చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details