Bangarajju movie: కింగ్ నాగార్జున 'బంగార్రాజు' సినిమా నుంచి పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ 'హేయ్ బంగార్రాజు' లిరికల్ గీతం రిలీజైంది. ఇందులో 'జాతిరత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లాతో కలిసి నాగచైతన్య, నాగార్జున మాస్ స్టెప్పులేశారు. శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు.
'సోగ్గాడే చిన్ని నాయన' చిత్రానికి ప్రీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. సంక్రాంతికి లేదా ఆ తర్వాత రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
తొలి భాగంలో నటించిన నాగార్జున, రమ్యకృష్ణతో పాటు ఈ సినిమాలో నాగచైతన్య, కృతిశెట్టి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు. కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జునే స్వయంగా నిర్మిస్తున్నారు.
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా 'గాడ్సే' టీజర్ రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం వెల్లడించింది. సోమవారం మధ్యాహ్నం 12:01 గంటలకు టీజర్ విడుదలవుతుందని పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ సినిమాలో సత్యదేవ్ హీరోగా నటిస్తున్నారు. గోపీగణేశ్ దర్శకత్వం వహిస్తున్నారు.