'సోగ్గాడే చిన్నినాయనా'కు(Nagarjuna movies) కొనసాగింపుగా రూపొందుతున్న చిత్రం బంగార్రాజు. నాగ్‌కు జోడీగా రమ్యకృష్ణ, నాగచైతన్యకు జోడీగా కృతిశెట్టి ఇందులో నటిస్తున్నారు. కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నటిస్తున్న నాగలక్ష్మి అనే కీలక ప్రాతను ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna movies).. జీ స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్నారు. సంక్రాంతి లక్ష్యంగా ముస్తాబవుతోంది. ఇందులో నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. రావు రమేష్, చలపతిరావు, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్, ఝాన్సీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
ఓటీటీలో 'రొమాంటిక్'
ఆకాష్ పూరీ, కేతికా శర్మ జంటగా అనిల్ పాదూరి దర్శకత్వం వహించిన చిత్రం 'రొమాంటిక్'(romantic movie release date). పూరీ కనెక్ట్స్ పతాకంపై పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించగా, సునీల్ కశ్యప్ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమాను నవంబర్ 26న ఓటీటీలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.
'నయీం డైరీస్' ట్రైలర్ రిలీజ్..