తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'దొరికావంటే నీ లైఫే బ్యాంగ్ బ్యాంగ్‌' - లావణ్య త్రిపాఠి

'అర్జున్ సురవరం' చిత్రంలో 'బ్యాంగ్ బ్యాంగ్...' అంటూ సాగే మొదటి గీతం విడుదలైంది. నిఖిల్ హీరోగా కనిపించనున్న ఈ సినిమా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

'దొరికావంటే నీ లైఫే బ్యాంగ్ బ్యాంగ్‌'

By

Published : May 5, 2019, 11:22 PM IST

నిఖిల్‌ హీరోగా నటించిన సినిమా 'అర్జున్ సురవరం'. ఇందులో పాత్రికేయుడి పాత్రలో కనిపించనున్నాడీ కథానాయకుడు. తాజాగా ఈ చిత్రంలోని ‘దొరికావంటే నీ లైఫే బ్యాంగ్ బ్యాంగ్‌.. ఉరికించేస్తా ఉచ్చులోకి..’ అంటూ సాగే గీతం విడుదలైంది. లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో కథానాయిక. సంతోష్‌ దర్శకుడు. శ్యాం సీఎస్‌ సంగీతం అందించాడు.

ఓ పాత్రికేయుడు సమాజంలోని సమస్యల్ని ఎలా చూపించాలి.. అనుకుంటాడు అనే విషయాన్ని వివరిస్తూ ఈ పాటను రచించారు. ఈ గీతాన్ని ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ నెల 17న ఈ సినిమా విడుదల కానుంది. చాలా రోజుల క్రితమే ఈ చిత్రం థియేటర్లలోకి రావాల్సి ఉన్నా.. పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.

ఇది చదవండి: త్వరలో ఓ ఇంటివారు కాబోతున్న నయన్, విఘ్నేశ్?

ABOUT THE AUTHOR

...view details