బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకుని ఏడాది దాటిపోయింది. ఇప్పటికీ ఆయన జ్ఞాపకాల్లోనే గడుపుతున్నారు అభిమానులు. అదేవిధంగా సుశాంత్ ఉరి వేసుకుని చనిపోయిన బాంద్రా అపార్ట్మెంట్ కూడా మూగబోయే ఉంది. ఈ కేసుపై విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో ఇప్పటివరకు ఈ ఫ్లాట్ ఖాళీగానే ఉంది. తాజాగా ఈ అపార్ట్‌మెంట్‌ను అద్దెకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు ఓనర్స్. అందుకోసం ప్రకటన కూడా విడుదల చేశారు. బీచ్ వ్యూ ఉన్న ఈ ఫ్లాట్ నెలవారి అద్దె రూ.4 లక్షలుగా పేర్కొన్నారు.
అద్దెకు సుశాంత్ ఫ్లాట్.. ధర ఎంతంటే? - సుశాంత్ బాంద్రా అపార్ట్మెంట్
బాలీవుడ్ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న బాంద్రా అపార్ట్‌మెంట్‌ను అద్దెకు ప్రకటించారు ఓనర్స్. బీచ్ వ్యూతో పాటు అనేక సదుపాయాలు ఉన్న ఈ డుప్లెక్స్ ఫ్లాట్‌కు నెలకు రూ. 4 లక్షలు అద్దెగా వెల్లడించారు.
సుశాంత్
జూన్ 14, 2020న బాంద్రా అపార్ట్మెంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు సుశాంత్. గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని తనువు చాలించాడు. 2019 డిసెంబర్ నుంచి ఈ డుప్లెక్స్ ఫ్లాట్‌లోనే ఉన్నాడు సుశాంత్. ఈ అపార్ట్‌మెంట్‌ను మూడేళ్లు అద్దెకు తీసుకున్నాడీ హీరో. ఒకవేళ ఈ ఘటన జరగకుంటే 2022 డిసెంబర్ వరకు ఈ ఫ్లాట్‌లోనే ఉండేవాడు. ఈ సమయంలో నెలకు రూ 4.5 లక్షలు చెల్లించేవాడు సుశాంత్.
ఇవీ చూడండి: 'షోలే' రికార్డు బ్రేక్ చేసిన 'గదర్'కు 20 ఏళ్లు
Last Updated : Jun 16, 2021, 9:08 AM IST