తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'రెచ్చగొట్టిన పులి.. పంజా విసరక మానదు' - bandobast

కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న చిత్రం 'బందోబస్త్'​. ఈ సినిమా టీజర్ నేడు విడుదలైంది. ఆర్య, మోహన్​లాల్​, సాయేషా సైగల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సూర్య

By

Published : Jul 6, 2019, 9:29 PM IST

సూర్య హీరోగా నటిస్తున్న చిత్రం 'బందోబస్త్'. ఈ సినిమా టీజర్​ నేడు విడుదలైంది. మోహన్​లాల్​, ఆర్య, సాయేషా సైగల్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కేవీ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

యాక్షన్ థ్రిల్లర్​గా తెరకెక్కిన ఈ చిత్ర టీజర్​ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. "మీరు రెచ్చగొట్టింది ప్రశాంతంగా నిద్రపోతున్న పులిని.. పంజా విసరక మానదు" లాంటి డైలాగ్​లు ఆకట్టుకుంటున్నాయి. "పోరాడటం తప్పంటే... పోరాడే పరిస్థితిని ఏర్పరచడం కూడా తప్పే కదా" అంటూ సాగే సంభాషణతో టీజర్​ ముగుస్తుంది.

ఈ సినిమాకు హారిస్ జయరాజ్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్​ పతాకంపై సుభాస్కరణ్ నిర్మిస్తున్నాడు. కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య నటించడం ఇది మూడో సారి. ఇంతకు ముందు వీడొక్కడే, బ్రదర్స్ చిత్రాల్లో ఇద్దరు కలిసి పనిచేశారు.

ఇది చదవండి: ఖతర్నాక్​ పాత్రతో ముమైత్​ఖాన్ రీఎంట్రీ

ABOUT THE AUTHOR

...view details